: ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచేందుకు పోరాటం చేస్తాం: రాజయ్య
ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజయ్య పర్యటన కొనసాగుతోంది. భద్రాచలంలో ఐటీడీఏ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలవరం ముంపు ప్రాంతాల విలీనం రాజ్యాంగ విరుద్ధమని, ఆర్డినెన్సును దొడ్డిదారిన తీసుకొచ్చారని అన్నారు. ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచేందుకు పోరాడుతామన్నారు. భద్రాచలాన్ని నాలుగు రాష్ట్రాలకు ఉపయోగపడేలా మెడికల్ హబ్ గా చేస్తామని ఆయన చెప్పారు. భద్రాచలం ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దుతామని రాజయ్య చెప్పారు. భద్రాచలం, యాదగిరిగుట్ట, వేములవాడ పుణ్యక్షేత్రాలను తిరుపతి స్థాయిలో తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం అన్నారు.