: సినిమాలకు గ్యాప్ ఇస్తానంటున్న కరీనా...ఏమన్నా విశేషమా?


బాలీవుడ్ లో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న కథానాయిక కరీనా కపూర్ సినిమా అవకాశాలను కాదంటోంది. తన తొలి ప్రాధాన్యత కుటుంబానికేనని, కొంత కాలం గ్యాప్ తీసుకుంటానని చెబుతోంది. మూడు నాలుగు నెలల తరువాత సినిమాల గురించి ఆలోచిస్తానని, సరైన సమయంలో తిరిగి వెండి తెరపై దర్శనమిస్తానని కరీనా అంటోంది. దిల్ ధడక్నే సినిమాతో బాటు, జోయా అఖ్తర్ సినిమాలో అవకాశం వచ్చినా కరీనా నో చెప్పింది. చేతిలో ఉన్న సినిమాలన్నింటినీ పూర్తి చేసింది. దీంతో బాలీవుడ్ లో ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఆ మధ్య వార్తల్లో వచ్చినట్టు కరీనా తల్లి కాబోతోందా? అంటూ బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. అదే నిజమైతే ఐశ్వర్యరాయ్ బాటలో కరీనా పయనిస్తున్నట్టు కనిపిస్తోంది. సినీ నటిగా కెరీర్ ఉన్నత స్థాయిలో ఉండగా అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకున్న ఐశ్వర్య, పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్న తరువాత వెండి తెరకు దూరమైంది. అడపాదడపా సినీ ఫంక్షన్లలో దర్శనమిస్తున్నా ఇంకా సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వలేదు. అదే నిజమైతే కరీనా అభిమానులను నిరాశకు గురి చేసినట్టేనని బాలీవుడ్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News