: ఇంతకీ ఆ భూతం ఉన్నట్టా? లేనట్టా?


గ్రేట్ వాల్ ఆఫ్ చైనా దిగువ భాగాన కొండలు, గుట్టల మధ్య వింత రంగులో, విచిత్రమైన చర్మంతో, వింతైన చెవులతో ఓ విచిత్ర జీవి దర్శనమిచ్చింది. దానిని చూసిన వారు పరుగులంకించుకోగా, ఓ వ్యక్తి మాత్రం దానిని కెమేరాలో బంధించాడు. రాళ్ల మధ్య కూర్చున్న ఆ వింత జీవికి గొల్లం భూతం అని పేరుపెట్టి తాను తీసిన ఫోటోని ఇంటర్నెట్ లో పెట్టాడు. అంతే, చైనా మొత్తం గొల్లం భూతం గురించే కబుర్లు!

ఈ ఫోటోను 32000 మంది రీ పోస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా, ఎవరి పాండిత్యానికి అనుగుణంగా వారు గొల్లం భూతంపై కథలు కూడా ప్రచారంలోకి తెచ్చారు. దీంతో అసలు గొల్లం భూతం అనేది ఉందా? అది భూతమేనా? లేక ఏదైనా వింత జీవా? అంటూ చైనా ప్రభుత్వం దర్యాప్తుకు అదేశించింది. అందుకు అధికారులను సిద్ధం చేసింది. ఇంతలో ఓ వ్యక్తి 'గొల్లం భూతం కాదు, వింత జంతువూ కాదు, అది నేనే' అంటూ ముందుకి వచ్చాడు.

ఓ టీవీ యాడ్ కోసం ఆ వేషం వేశానని ఆయన తెలిపాడు. తన వేషమే అది అంటూ తాను దిగిన ఫోటోలను చూపించాడు. తన మేకప్ దృశ్యాలను కూడా మీడియాకు చూపించాడు. అయినా చైనీయులు నమ్మకపోవడంతో అందరి ముందూ ఆ వేషం వేసుకుని చూపించాడు. 'సరే అది నువ్వే అనుకుందాం, అక్కడ, అలా ఎందుకు కూర్చున్నావు?' అంటూ ఆ నటుడ్ని ప్రశ్నించారట. ఏం చెప్పమంటారండీ...అక్కడ చెప్పలేని దేహబాధలు తీర్చుకుంటున్నానని సమాధానమిచ్చాడా నటుడు!

  • Loading...

More Telugu News