: జైట్లీతో సుదీర్ఘంగా చర్చించిన చంద్రబాబు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. రాజధాని నిర్మాణం కోసం రానున్న బడ్జెట్లో నిధులను కేటాయించాలని ఈ సందర్భంగా చంద్రబాబు కోరారు. పోలవరం నిర్మాణానికి అవసరమయ్యే రూ. 7 వేల కోట్లను మార్చిలోగా సమకూర్చాలని విన్నవించారు. లోటు బడ్జెట్ ను భర్తీ చేయాలని కూడా కోరారు. ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎంల నిర్మాణానికి వచ్చే బడ్జెట్లో నిధులను కేటాయించాలని జైట్లీకి విజ్ఞప్తి చేశారు.