: ఆస్ట్రేలియాలో భారతీయ సంతతి వ్యక్తికి అత్యున్నత పదవి
ఆస్ట్రేలియాలో అతిపెద్ద ఆర్థిక సంస్థల్లో ఒకదానిలో భారత సంతతి వ్యక్తి అత్యున్నత పదవి చేపట్టనున్నారు. పీయూష్ గుప్తా అనే వ్యక్తి ఆస్ట్రేలియాలోని నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంక్ (నాబ్) కు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. నవంబర్ 5 తో ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జఫ్ టామ్లిసన్ పదవీ విరమణ గడువు ముగుస్తుండడంతో ఈ తరువాత పదవీ బాధ్యతలు పీయూష్ స్వీకరిస్తారని నాబ్ ఛైర్మన్ మైఖేల్ ఛానీ తెలిపారు.