: ఐపీఎల్ లో నేటి వినోదం


ఐపీఎల్ ఆరవ సీజన్ లో భాగంగా నేడు జరగనున్న రెండు మ్యాచ్ లు క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచనున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సాయంత్రం 4 గంటలకు 'బెంగళూరు రాయల్ చాలెంజర్స్-కోల్ కతా నైట్ రైడర్స్' జట్లు తలపడబోతున్నాయి. అనంతరం 8 గంటలకు పుణే వేదికగా 'పుణె వారియర్స్-రాజస్థాన్ రాయల్స్' జట్లు తలపడతాయి. కాగా, నిన్నరాత్రి 'కింగ్స్ ఎలెవన్ పంజాబ్-చెన్నై సూపర్ కింగ్స్' మధ్య జరిగిన పోరులో చెన్నై జట్టు బోణి కొట్టింది. 17.2 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టపోకుండా 139 పరుగులతో విజయం విహారంచేసింది. పంజాబ్ 10 వికెట్లు నష్టపోయి 138 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News