: బ్యాంకర్లు రైతులకు నోటీసులు ఇవ్వవద్దు, వారిని ఇబ్బంది పెట్టవద్దు: పరిటాల సునీత
అనంతపురం జిల్లాలో రైతులకు వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వ్యవసాయానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని వారు పునరుద్ఘాటించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ తప్పక అమలు చేస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్న దృష్ట్యా బ్యాంకర్లు రైతులకు నోటీసులు ఇవ్వవద్దని, అన్నదాతలను ఇబ్బంది పెట్టే చర్యలు చేపట్టవద్దని పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లాలో ఉద్యానవన విశ్వవిద్యాలయం, కేంద్రీయ వర్శిటీలతో పాటు ఐటీ పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నట్లు పల్లె రఘునాథరెడ్డి చెప్పారు.