: ఏపీలో ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు సిద్ధంగా లేము: మంత్రి రాఘవరావు
ఆంధ్రప్రదేశ్ లో 15 శాతం ఆర్టీసీ ఛార్జీలు పెంచాలని అధికారులు ప్రతిపాదించారని మంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు. అయితే, ఛార్జీలు పెంచేందుకు తాము ఏ మాత్రం సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. అయితే, ఏపీలో రోజుకు ఆర్టీసీకి రూ. 2.70 కోట్ల నష్టాలు వస్తున్నాయని, నష్టాల ఊబి నుంచి సంస్థను బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామనీ అన్నారు. ముఖ్య నగరాల్లో బైపాస్ లు, రింగ్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. వాహనాల నంబర్ ప్లేట్ల మార్పు సాధ్యం కాదని చెప్పారు.