: విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయండి: కేసీఆర్
విద్యుత్ పై తెలంగాణ ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. విద్యుత్ లభ్యత, లోటు వంటి అంశాలపై చర్చించారు. విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అంతేకాకుండా, విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. అవసరమనుకుంటే తానే ఛత్తీస్ గఢ్ వెళ్లి అక్కడి ముఖ్యమంత్రితో చర్చిస్తానని చెప్పారు. ఈ సమావేశానికి సంబంధిత ఉన్నతాధికారులు పలువురు హాజరయ్యారు.