: కృష్ణా లేదా గుంటూరు జిల్లాల్లో ఎయిమ్స్ తరహా ఆసుపత్రి: మంత్రి కామినేని


ఎయిమ్స్ తరహా ఆసుపత్రి నిర్మాణం కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో స్థలాన్ని పరిశీలిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. కేంద్ర కమిటీ పర్యటన అనంతరం ఎక్కడ నిర్మించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలో కోతపడిన మెడికల్ సీట్లను తిరిగి తెచ్చుకునేందుకు చర్యలను ప్రారంభించామని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తామని... ఎంసీఐ తన నిర్ణయాన్ని మరోసారి పరిశీలించేలా చూస్తామని చెప్పారు. ఈ రోజు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News