: నేపాల్ ప్రధానికి టీబీ
నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా టీబీ (క్షయ) వ్యాధి బారినపడ్డారు. ప్రస్తుతం అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారు. సుశీల్ కేన్సర్ వ్యాధికి గురి కాలేదని, క్షయ వ్యాధితో బాధపడుతున్నట్లు నేపాలీ కాంగ్రెస్ నేత ఒకరు వెల్లడించారు. గతవారం సుశీల్ న్యూయార్క్ లోని ఓ కేన్సర్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా, చాతీలో మచ్చను గుర్తించారు. దీంతో కేన్సరేమో అన్న వదంతులు వ్యాప్తి చెందాయి. దీంతో నేపాలీ కాంగ్రెస్ నేత దిలేంద్ర ప్రసాద్ బాదు మాట్లాడుతూ... ప్రధాని సుశీల్ కోయిరాలకు క్షయ ఉన్నట్లు తేలిందని, ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారని, వారం పది రోజుల్లో నేపాల్ కు తిరిగివస్తారని చెప్పారు.