: మంత్రిపై దోపిడీ కేసు


ఉత్తరప్రదేశ్ లో సాక్షాత్తు మంత్రిపై దోపిడీ కేసు నమోదైంది. మత్స్యశాఖ మంత్రి ఇక్బాల్ మసూద్ ఓ వ్యక్తిని బెదిరించి దోపిడీకి పాల్పడ్డట్టు కేసు నమోదైంది. దీనిపై, వెంటనే ఆయనను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించింది. నూతన్ విజయ్ అనే న్యాయవాది నివాసంలోకి మంత్రి తన అనుచరులతో కలిసి వెళ్ళి అక్కడి విలువైన వస్తువులను లూటీ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతకుముందు మే 28న తన దిష్టిబొమ్మలను దహనం చేసినందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారని కూడా నూతన్ విజయ్ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కోర్టు సదరు మంత్రిపై కేసు పెట్టాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను మంత్రి ఇక్బాల్ మసూద్ ఖండించారు.

  • Loading...

More Telugu News