: ప్రధానమంత్రి, బీజేపీపై బాంబే హైకోర్టులో పిల్... తిరస్కరణ


బీజేపీ అధికారంలోకి వచ్చి, నరేంద్ర మోడీ ప్రధాని అయితే దేశానికి మంచి రోజులు వస్తాయంటూ ఎన్నికల ప్రచారంలో ఆకట్టుకుని ఓట్లు వేయించుకున్న ఎన్డీఏ ప్రభుత్వం మాట తప్పిందంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టి నెలరోజులు (26వ తేదీకు) గడుస్తున్న నేపథ్యంలో, 'ఇంకా దేశ ప్రజలకు మంచి రోజులెప్పుడూ?' అంటూ బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఇందులో మోడీ, బీజేపీని ప్రధానంగా పేర్కొన్నారు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ తప్పారని అందులో ఆరోపించారు. ముంబయికి చెందిన ఆల్ ఇండియా కరప్షన్ అండ్ సిటిజన్స్ వెల్ ఫేర్ కోర్ కమిటీ, దాని స్థాపకుడు, న్యాయవాది ఎం.వి.హోమాగి ఈ పిల్ వేశారు. రైల్వే ఛార్జీలు, ఇతర సరుకుల ధరలు పెంచి, ముందుగా ఇచ్చిన హామీలను తప్పి, నేరం చేశారంటూ మోడీ ప్రభుత్వం, బీజేపీపై ఆరోపణలు చేశారు. అయితే, సదరు పిల్ ను కొట్టివేసినట్టు కోర్టు బెంచి న్యాయవాదికి తెలిపింది.

  • Loading...

More Telugu News