: తెలంగాణలో బ్రహ్మాండమైన నాయకులున్నారు... నాయకత్వమే లేదు: జానారెడ్డి
తెలంగాణలో బ్రహ్మాండమైన నాయకులు, మహానుభావులు ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్సీలు పార్టీ వీడడం సరికాదని అన్నారు. తెలంగాణలో పీసీసీ నియామకంపై అధిష్ఠానం జాప్యం కూడా పార్టీ ఓటమికి కారణమైందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో నాయకత్వ లోపం ఉందని, దానిని పూరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.