: అనంతపురం జిల్లాను ఆదుకుంటాం: పరిటాల సునీత


అనంతపురం జిల్లాను అభివృద్ధి చేస్తామని మంత్రి పరిటాల సునీత తెలిపారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. అనంతపురం జిల్లాలో సెంట్రల్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామని ఆమె వెల్లడించారు. నిరుద్యోగ సమస్యను పారద్రోలేందుకు ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నామని ఆమె తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించి పరిశ్రమలను ప్రోత్సహిస్తామని సునీత చెప్పారు.

  • Loading...

More Telugu News