: పాలమూరుకు కేసీఆర్ అండ: కేటీఆర్
తెలంగాణలో అత్యంత వెనుకబడిన పాలమూరుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటారని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేబినెట్ విస్తరణలో మహబూబ్ నగర్ జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. మహబూబ్ నగర్ నుంచి వలసలు తగ్గించి జిల్లాను సుసంపన్నం చేయడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యాక్రమాల అమలు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు.