: ఇరాక్ ముక్కలవడం ఖాయం: ఇజ్రాయెల్ అధ్యక్షుడు


వర్గ పోరుతో నెత్తురోడుతున్న ఇరాక్ ఇంకెన్నో రోజులు ఒకే దేశంగా మనలేదని ఇజ్రాయెల్ అధ్యక్షుడు షిమోన్ పెరెజ్ స్పష్టం చేశారు. త్వరలోనే అది ముక్కలవుతుందని కుండ బద్దలుకొట్టారు. అమెరికా అధ్యక్షుడు ఒబామాను వైట్ హౌస్ లో కలసిన సందర్భంగా ఆయన ఒబామాతో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాక్ ఒకవేళ ఒకటిగానే ఉండాలంటే... బలమైన సైన్యాన్ని అమెరికా పంపాలని సూచించారు. దీనికి తోడు, ఇరాక్ లో ఉన్న వర్గాలతో చర్చలు జరిపి... వాటిని ఒక తాటిమీదకు తీసుకురావాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇరాక్ లోని వర్గాలను కలపడం ప్రస్తుత పరిస్థితుల్లో అంత సులభం కాదని కూడా చెప్పారు. ప్రస్తుతం షిమోన్ పెరెజ్ అధికారిక పర్యటన నేపథ్యంలో అమెరికాలో ఉన్నారు.

  • Loading...

More Telugu News