: సీఎస్ఐ చర్చి బిషప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు


సీఎస్ఐ చర్చి బిషప్ దైవాశీర్వాదంపై లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. సీఎస్ఐ చర్చి పాస్టర్ గా పనిచేస్తున్న తన భర్త బదిలీని రద్దుచేయాలని కోరిన తనను బిషప్ లైంగికంగా వేధించాడని సదరు పాస్టర్ భార్య ఆరోపిస్తోంది. అంతేకాకుండా సూర్యాపేటలోని పోలీస్ స్టేషన్ లో బిషప్ పై బాధితురాలు కేసు పెట్టింది. బిషప్ తమను ఎంతగానో వేధిస్తున్నాడని... అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అయితే, లైంగిక వేధింపుల ఆరోపణలను బిషప్ ఖండించారు. బిషప్ స్థాయిలో ఉన్న తనను దెబ్బతీయడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆమె భర్తను బదిలీ చేశానన్న అక్కసుతోనే ఈ దారుణానికి ఒడిగడుతున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News