: బుల్లితెర నటికి అసభ్య సందేశాలు... యువకుడి అరెస్టు


ఓ టీవీ నటిని వేధింపులకు గురిచేస్తున్న యువకుడిని హైదరాబాదు ఎల్బీ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. సదరు బుల్లితెర నటి న్యూనాగోలు కాలనీలో నివాసముంటోంది. అక్కడికి సమీపంలోని కొత్తపేటలో నివాసముండే భరత్ అనే యువకుడు ఆమె ఫోన్ కు కొంతకాలంగా అసభ్య సందేశాలు పంపుతున్నాడు. దీంతో, ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈనెల 15 రాత్రి కూడా ఆమెకు మెసేజి పంపాడు. ఈ నేపథ్యంలో గతరాత్రి ఆ నటి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భరత్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. భరత్ స్వస్థలం నల్గొండ జిల్లా లింగాల గ్రామం.

  • Loading...

More Telugu News