: శాంతియుత వాతావరణంలో పండుగలు: హైదరాబాద్ పోలీస్ కమిషనర్
పండుగలను శాంతియుతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. రంజాన్, మహంకాళీ అమ్మవారి జాతరలను దృష్టిలో ఉంచుకుని పీస్ కమిటీ, మైత్రీ బృందాలతో ఆయన సమావేశమయ్యారు. గత ఏడాది కన్నా ఎక్కువ మందిని బందోబస్తుకు ఉపయోగిస్తున్నామని సీపీ చెప్పారు. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, చోరీలపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని మహేందర్ రెడ్డి చెప్పారు.