: ఆధార్ కార్డు ఉంటేనే రుణ మాఫీ: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
ఆధార్ కార్డు ఉన్న రైతులకే రుణ మాఫీ చేస్తామని ఏపీ వ్యవసాయ శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఆధార్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు తీయించి ఈ పథకంతో లింకప్ చేస్తామని ఆయన అన్నారు. రుణాలను రీషెడ్యూల్ చేయాలని ప్రధాని మోడీని కోరతామన్నారు. ఖరీఫ్ రుణాలను రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని ఆయన అన్నారు. మొత్తం రూ. 1148 కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతామని మంత్రి చెప్పారు.