: ట్రాఫిక్ పరిశీలనకు ముంబైకి బృందం తీసుకెళ్తా: టీ మంత్రి మహేందర్ రెడ్డి
దినదిన ప్రవర్ధమానమవుతున్న ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి హైదరాబాద్ వాసులను గట్టెక్కించేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలంగాణ రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి హైదరాబాదీలను గట్టెక్కించేందుకు త్వరలోనే హెచ్ఎండీఏ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, నిపుణులతో ఓ బృందాన్ని తయారు చేసి ముంబై పంపించనున్నామని చెప్పారు. ముంబైలో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు చేసిన ఏర్పాట్లను ఈ బృందం అధ్యయనం చేయనుందని ఆయన తెలిపారు. ముంబై కంటే మెరుగైన సౌకర్యాలతో హైదరాబాదులో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తామని ఆయన అన్నారు.