: రేపు ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. రెండు రోజుల పాటు ఈ పర్యటన ఉంటుంది. ఈ సమయంలో పలువురు కేంద్ర మంత్రులతో బాబు సమావేశమవుతారు. ముందుగా రేపు 10 గంటలకు విద్యుత్ మంత్రి పియూష్ గోయల్, 11కు జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, మధ్యాహ్నం 12.45కు వెంకయ్యనాయుడితో, 3.30కు అరుణ్ జైట్లీతో, సాయంత్రం 6 గంటలకు రైల్వే మంత్రి సదానంద గౌడలను చంద్రబాబు కలుస్తారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, ఆదాయ వనరులపై చర్చిస్తారు.

  • Loading...

More Telugu News