: ఆన్ లైన్ మోసం ఆటకట్టు... నైజీరియన్ అరెస్టు
ఆన్ లైన్ మోసానికి తిరుపతిలో అడ్డుకట్ట పడింది. ఈ కేసులో వెంకటరమణ నాయుడు అనే వ్యక్తిని మోసగించేందుకు ప్రయత్నించిన నైజీరియన్ ను తిరుచానూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఇమ్యానువల్ ద్వారా ఓ మహిళ ఆన్ లైన్ లో వెంకటరమణకు పరిచయమైంది. ఇటీవల జింబాంబ్వేలో జరిగిన అల్లర్లలో తన తండ్రి మరణించాడని, తన వద్దనున్న డాలర్లను ఇచ్చేస్తానని, తన మిత్రుడు ఇమ్యానువల్ ద్వారా డాలర్లు తీసుకోవాలని చెప్పింది. దీంతో తిరుపతికి వచ్చిన ఆ నైజీరియన్ తన వద్ద డాలర్లు ప్రింట్ చేసే పేపర్లు, కెమికల్ ఉన్నాయని, వాటిని కొనాలని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన వెంకటరమణ నాయుడు పోలీసులకు సమాచారం అందించాడు.