: చంద్రబాబు తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నారు: కేసీఆర్
మర్యాద కోసమే పదేళ్లపాటు సీమాంధ్రులతో కలిసుండేందుకు ఒప్పుకున్నామని... కానీ, సీమాంధ్ర నేతలు మాత్రం దురహంకారంతో వ్యవహరిస్తున్నారని టి.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. కొత్త రాష్ట్రం ఏర్పడినా... ఇంకా జలదోపిడీకి ప్రయత్నిస్తామని అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. దొడ్డిదారిన తెచ్చుకున్న ఆర్డినెన్స్ తో తెలంగాణలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుకున్నారని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.