: తమిళనాడులో విద్యార్థులకు ల్యాప్ టాపులు ఫ్రీ
తమిళనాడు ప్రభుత్వం ఈ ఏడాది 5.5 లక్షల ల్యాప్ టాప్ లను విద్యార్థులకు ఉచితంగా అందజేసేందుకు నిర్ణయించింది. ఉన్నత పాఠశాల, కళాశాలలో చదివే విద్యార్థులకు వీటిని అందించనున్నారు. వీటి విలువ రూ.1100 కోట్లు. తమిళనాడు సీఎం జయలలిత ఉచిత ల్యాప్ టాప్ పంపిణీ పథకాన్ని 2011లో ప్రారంభించింది. ఇప్పటివరకు ప్రభుత్వం రూ.2500 కోట్ల విలువ చేసే 17 లక్షల ల్యాప్ టాప్ లను పంపిణీ చేసింది. ఈ సంవత్సరం కొత్తగా మరో 5.5 లక్షల ల్యాప్ టాప్ లను పంపిణీ చేయనుంది.