: టీఆర్ఎస్ లో చేరిన 9 మంది ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు
9 మంది ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. బీఎస్పీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప... కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు కేఆర్ ఆమోస్, రాజలింగం, భూపాల్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, భాను ప్రసాదరావు... ఇద్దరు పీఆర్టీయూ ఎమ్మెల్సీలు పూలరవీందర్, జనార్ధనరెడ్డి... ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, సలీం టీఆర్ఎస్ లో చేరారు. వీరి చేరికతో టీఆర్ఎస్ ఎమ్మెల్సీల సంఖ్య 16కు చేరింది.