: 'ట్వీటు' మార్చిన డిగ్గీ రాజా మరదలు
'మా ఇంట్లో త్వరలోనే పెళ్ళి బాజాలు మోగనున్నాయోచ్!' అంటూ ట్విట్టర్లో గోల చేసిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మరదలు రుబీనా శర్మ నేడు మాట మార్చారు. తాను ట్విట్టర్లో ఆ కామెంట్ చేసింది దిగ్విజయ్ గురించి కాదని, తన కజిన్ గురించి అని వివరణ ఇచ్చారు. అంతేగాకుండా, 'పాపం, ఆ పెద్దాయనను వదిలేయండి' అంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు. మీడియాలో ఇలాంటి వార్తలు రావడం ఎంతో విచారకరమని ఆమె అభిప్రాయపడ్డారు. రుబీనా శర్మ... డిగ్గీ రాజా చిన్న తమ్ముడు లక్ష్మణ్ సింగ్ అర్థాంగి. కాగా, దిగ్విజయ్ సింగ్ గత కొంతకాలంగా టీవీ యాంకర్ అమృతా రాయ్ తో ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే.