: గవర్నర్ వ్యవస్థకు టీడీపీ, టీఆర్ఎస్ కళంకం తెచ్చాయి: రఘువీరా రెడ్డి
రెండు రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థకు టీడీపీ, టీఆర్ఎస్ లు కళంకం తెచ్చాయని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. దీనిపై రెండు రాష్ట్రాలను మందలించి గవర్నర్ నరసింహన్ వివరణ కోరాలని డిమాండ్ చేశారు. అంతేకాక వారిచ్చిన హామీలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభల్లో గవర్నర్ ప్రసంగం పరస్పర విరుద్ధంగా ఉందన్నారు.