: రాజధాని ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేసిన మోడీ
రాజధాని ఎక్స్ ప్రెస్ ప్రమాదం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు వెంటనే కోలుకోవాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి తోడు, రైల్వే మంత్రి సదానందగౌడతో సహాయక చర్యల గురించి మోడీ వాకబు చేశారు. ఈ వివరాలను ప్రధాని కార్యాలయం తెలిపింది.