: బియాస్ నది మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించండి: హిమాచల్ హైకోర్టు


బియాస్ నదిలో గల్లంతై మృతి చెందిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఇందులో లార్జీ జలాశయం నిర్వాహకులు, కళాశాల యాజమాన్యం చెరో సగం పరిహారం ఇవ్వాలని తెలిపింది. అంతేగాక జులై 9నాటికి స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని హైదరాబాదు విజ్ఞాన్ జ్యోతి కళాశాలను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు తీర్పు వెల్లడించిన న్యాయస్థానం, ఇకముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 17 మంది విద్యార్థుల మృత దేహాలు దొరికాయి. మిగతా వారికోసం బియాస్ నదిలో రక్షణ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News