: బడ్జెట్ సమావేశాలకు ముందే గవర్నర్ల నియామకం: రాజ్ నాథ్ సింగ్


బీజేపీ సీనియర్లను గవర్నర్లుగా నియమించేందుకు యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లను రాజీనామా చేయాల్సిందేనని ఒత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జులై 7 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలకు ముందే ఖాళీ అయిన స్థానాల్లో కొత్త గవర్నర్లను నియమించేందుకు ఎన్డీఏ సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు మాట్లాడుతూ, గవర్నర్లను ముందుగానే నియమించడాన్ని ఖండించలేమన్నారు. మూడు నాలుగు రోజుల్లో గవర్నర్ల నియామకానికి సంబంధించి నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఈ క్రమంలో తాజాగా గోవా గవర్నర్ బి.వి. వాంచో రాజీనామా చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News