: చెన్నై మసీదులో ఐఏఎస్ కోచింగ్


అప్పట్లో మనదేశంలో ప్రార్థనామందిరాలు విద్యాలయాలుగానూ భాసిల్లాయి. చరిత్రలో అందుకు ఎన్నో ఆధారాలున్నాయి. నేటి కాలంలో కొన్ని మఠాలు ప్రత్యేక కోర్సులను ఆఫర్ చేయడం తెలిసిందే. ఈ క్రమంలో చెన్నైలోని మక్కా మసీదులో ఐఏఎస్ కోచింగ్ కేంద్రాన్ని ప్రారంభించడం విశేషం. ఇక్కడ కోచింగ్ ఇచ్చేందుకు అత్యుత్తమ ఫ్యాకల్టీని నియమించారు. ప్రస్తుతం ఇక్కడ 28 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. 'మా వర్గం పురోగామి పథంలో నడవాలన్నదే ఈ కోచింగ్ సెంటర్ లక్ష్యం' అని అక్కడ శిక్షణ పొందుతున్న మహ్మద్ అష్రాఫ్ అనే విద్యార్థి చెప్పాడు. కాగా, వీరికి ఇక్కడ ఉచితంగానే కోచింగ్ ఇస్తారు. ఈ కేంద్రం నిర్వహణకు ఏడాదికి రూ.40 లక్షలు కావాల్సి ఉండగా, అందుకు అవసరమైన నిధులను విరాళాల రూపంలో సేకరిస్తున్నారు.

దేశ జనాభాలో ముస్లింలు 14 శాతం ఉండగా, అధికారగణంలో వీరు 3 శాతం మాత్రమే ఉన్నారు. ఈ విషయంలో తమ ప్రయత్నం కొంచెం మార్పు తీసుకువచ్చినా, అది మరికొందరికి మార్గదర్శనం చేస్తుందని మక్కా మసీదు కోచింగ్ సెంటర్ వర్గాలు భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News