: రవిశంకర్ ప్రసాద్ మృతిపై సీబీఐ విచారణ ప్రారంభం
యానాంలోని హోటల్ ఆనంద్ రీజెన్సీ ఎండీ రవిశంకర్ ప్రసాద్ మృతిపై సీబీఐ విచారణ ప్రారంభమైంది. సీబీఐ చెన్నై విభాగం డీఐజీ సంగీతేర్, ఎస్పీ శర్వానంద్ ఇవాళ యానాం చేరుకున్నారు. రవిశంకర్ ప్రసాద్ 2013 జూలై 8న యానాంలో అదృశ్యమయ్యారు. ఐదు రోజుల తర్వాత గోదావరిలో శవమై తేలడంతో ఆయన మరణం మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ చేపట్టింది.