: ఆ బిల్లు ఇక కోల్డ్ స్టోరేజీలోకే!


గతంలో యూపీఏ ప్రభుత్వం తీసుకురాదలచిన వివాదాస్పద మతహింస నిరోధక బిల్లు ఇక కోల్డ్ స్టోరేజీకే పరిమితం కానుంది. ఏదైనా ప్రాంతంలో మత ఘర్షణలు జరిగితే స్థానికంగా మెజారిటీగా ఉన్న మతస్థులను బాధ్యులను చేసే నిబంధన కూడా ఈ బిల్లులో ఉంది. అప్పట్లో బీజేపీ సహా విపక్షాల తీవ్ర వ్యతిరేకతతో యూపీఏ ప్రభుత్వం ఈ బిల్లు విషయంలో వెనక్కి తగ్గింది. ప్రస్తుతం కేంద్రంలో కొలువైనది బీజేపీ ఆధ్వర్యంలోని ఏన్డీయే సర్కారు కావడంతో ఇక ఆ బిల్లు అటకెక్కినట్లే. దీనికి బదులు మత హింస నిరోధానికి జాతీయ స్థాయిలో ఓ కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడానికి కేంద్ర హోంశాఖ సిద్ధమవుతోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించనుందని సమాచారం.

  • Loading...

More Telugu News