: రైతులకు నోటీసులు జారీ చేసిన బ్యాంక్... ఆందోళనలో రైతన్నలు
ప్రభుత్వం రైతు రుణాలను మాఫీ చేస్తుందన్న భరోసాతో ఉన్న రైతన్నలకు ఊహించని పరిణామం ఎదురైంది. గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడుకు చెందిన 29 మంది రైతులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటీసులు జారీ చేసింది. వ్యవసాయం కోసం తీసుకున్న రుణాలను వెంటనే చెల్లించాలని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రైతులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. రైతు రుణమాఫీ జరుగుతుందని భావిస్తున్న తరుణంలో... నోటీసులు అందడంతో దిక్కుతోచని స్థితిలోకి పడిపోయారు.