: నటులకు, భిక్షగాళ్ళకు తేడాలేదంటున్న రాణి ముఖర్జీ
బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ నిర్వేదం వ్యక్తం చేశారు. బాలీవుడ్ లో నటులు భిక్షగాళ్ళవంటివారేనని వ్యాఖ్యానించారు. తమకు నచ్చిన పాత్ర అడిగి తీసుకోలేరని, ఎవరు ఏ పాత్ర ఇస్తే అదే తీసుకోవాల్సిన పరిస్థితి అని వివరించారు. తాను ప్రధాన పాత్ర పోషిస్తున్న 'మర్దాని' చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాణి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'మేమెన్నటికీ పాత్రలను ఎంచుకోలేం. దర్శకులు, నిర్మాతల వంటి క్రియేటివ్ వ్యక్తులు మాకు పాత్రలు ప్రదానం చేస్తుంటారు' అని వాపోయారు. కాగా, 'మర్దాని' చిత్రంలో రాణి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు.