: కారులో చిన్నారి... పబ్ లో తల్లి


నైట్ క్లబ్ లో చిందులేయడానికి చిన్నారిని నిర్లక్ష్యంగా కారులో వదిలేసిన ఓ మహిళను అమెరికాలో పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణాసియా ప్రాంతానికి చెందిన ఉజ్మాషేక్ ఈశాన్య హారిస్ కౌంటీలో ఓ క్లబ్ కు వెళుతూ మూడేళ్ల కొడుకును కూడా తీసుకెళ్లింది. డోర్ దగ్గరున్న వ్యక్తి చిన్నారిని అనుమతించలేదు. దాంతో ఉజ్మా వెనక్కి వెళ్లి చిన్నారిని కార్లో వదిలేసి లాక్ చేసి తిరిగొచ్చింది. అనుమానం వచ్చిన కాపలాదారుడు కారు వద్దకు చేరుకుని చూడగా లోపల చిన్నారి కనిపించాడు. ఈ సమాచారాన్ని అతడు పోలీసులకు చేరవేశాడు. వారొచ్చి ఉజ్మాషేక్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. 2వేల డాలర్ల బాండ్ ను సమర్పించిన అనంతరం ఆమె విడుదలైంది.

  • Loading...

More Telugu News