: విద్యార్థులను ఎన్ కౌంటర్ చేసిన పోలీస్ కు మరణశిక్ష


ముగ్గురు కాలేజీ విద్యార్థులను 2002లో నకిలీ ఎన్ కౌంటర్ చేసిన బీహార్ పోలీస్ అధికారికి పాట్నా కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. ఇదే కేసులో ఒక కానిస్టేబుల్ తో పాటు పోలీస్ అధికారికి సహకరించిన మొత్తం ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. 20 ఏళ్ల వయసున్న పాట్నా విద్యార్థులు వికాస్ రంజన్, ప్రశాంత్, హిమాన్షు యాదవ్ లు ఫోన్ కాల్స్ కు బిల్లు చెల్లించే విషయమై ఎస్టీడీ బూత్ యజమానితో గొడవపడ్డారు. దీంతో స్టేషన్ ఆఫీసర్ షమ్సే ఆలం 2002 డిసెంబర్ 28న వారిని కాల్చి చంపి, గ్యాంగ్ స్టర్లుగా చిత్రీకరించినట్లు విచారణలో రుజువైంది.

  • Loading...

More Telugu News