: రంగంలోకి దిగిన డీఎస్... ఎమ్మెల్సీలకు బుజ్జగింపు


ఎన్నికల్లో ఓడిపోయిన డి.శ్రీనివాస్ కు, షబ్బీర్ అలీకి శాసనమండలిలో ఫ్లోర్ లీడర్ పదవులు ఇవ్వడంపై టి.కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మండిపడుతున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉండదని వారు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆమోస్, యాదవరెడ్డి, రాజలింగం, భానుప్రసాద్ రావు, భూపాల్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డిలు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మధ్యాహ్నం వీరంతా గులాబీ కండువా కప్పుకోవడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలను బుజ్జగించేందుకు డీఎస్ రంగంలోకి దిగారు. అందరికీ వ్యక్తిగతంగా ఫోన్లు చేసి మంతనాలు జరుపుతున్నారు. దీనికి తోడు, ఈ మధ్యాహ్నం వీరందరితో ఆయన భేటీ కానున్నారు.

  • Loading...

More Telugu News