: వైసీపీ,ఎంఐఎంలకు తెలంగాణలో గుర్తింపు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్-ఇ-ఇతిహదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) ను తెలంగాణ రాష్ట్ర పార్టీలుగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఎన్నికల సంఘంలో ఇంతవరకు కేవలం రిజిస్టర్డ్ పార్టీలుగా ఉన్న వాటికి ఇటీవల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ గుర్తింపు లభించింది. రెండు నెలల కిందట జరిగిన ఎన్నికల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు పోటీ చేసిన ఎంఐఎం మంచి ఫలితాలు రాబట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్ర పార్టీగా ఎంఐఎంను గుర్తించినట్టు ఆ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఏపీలో రాష్ట్ర పార్టీ గుర్తింపు ఉన్న తమకు తెలంగాణలో కూడా గుర్తింపు వచ్చినందుకు ఆనందంగా ఉందని వైసీపీ తెలిపింది. ఇక్కడ కూడా పార్టీకి 'సీలింగ్ ఫ్యాన్' గుర్తును కేటాయించిందని చెప్పింది.