: 14 మంది సాక్షుల పేర్లను చెప్పిన ప్రీతిజింటా


ప్రీతి జింటా నుంచి ముంబై పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారు. తనపై మాజీ ప్రియుడు నెస్ వాడియా మే 30న వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా వేధించాడని, గౌరవానికి భంగం కలిగించాడని ఆమె కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రీతి వాంగ్మూలాన్ని పోలీసులు వాంఖడే స్టేడియంలోనే నిన్న సాయంత్రం రికార్డు చేశారు. నాటి ఘటనకు సాక్షులుగా నెస్ వాడియా స్నేహితులు సహా మొత్తం 14 మంది పేర్లను ప్రీతి పోలీసులకు తెలియజేసింది. స్టేడియంలో తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మూడు ప్రదేశాలను దర్యాప్తు అధికారులకు ఆమె చూపించారు. దీంతో ప్రీతి పేర్కొన్న సాక్షులను త్వరలో విచారించే అవకాశం ఉంది. మరోవైపు దర్యాప్తునకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు నెస్ వాడియా తరపు న్యాయవాది పోలీసులకు తెలిపారు.

  • Loading...

More Telugu News