: నాన్న లేదా భర్త... చాయిస్ మహిళలదే
మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి మహిళలకు సంబంధించి మరో ఆదర్శ నిర్ణయాన్ని తాజాగా అమల్లోకి తీసుకొచ్చింది. మహిళలు తమకు సంబంధించిన అన్ని రకాల పత్రాల్లో భర్త లేదా తండ్రి పేరును వారి ఇష్ట ప్రకారం చేర్చుకోవచ్చు. అలాగే, చిన్నారులు కూడా స్కూల్ అడ్మిషన్లలో, ఇతర అన్ని రకాల పత్రాల్లోనూ అమ్మ లేదా నాన్న, కావాలంటే ఇద్దరి పేర్లను చేర్చుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఒకవేళ ఈ అవకాశం వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది.