: పిట్ట కొంచెం.. 'అప్లికేషన్' ఘనం!


ఆ బాలుడి వయస్సు 13 ఏళ్ళు. పేరు జయకృష్ణ, చదివేది విశాఖపట్నం నారాయణ ఐఐటీ అకాడమీలో ఎనిమిదో తరగతి. తన ఈడు పిల్లలంతా ఖాళీ సమయాల్లో ఏ ఆటలాడుకుంటూనో, వీడియో గేమ్స్ తో కుస్తీ పడుతూనో కాలక్షేపం చేయడం సహజం. కానీ ఈ విశాఖ కుర్రాడు మాత్రం ఏకంగా అద్భుతమే సృష్టించాడు. ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే సమయంలో హ్యాకర్ల నుంచి రక్షణ కల్పించే ఓ సూపర్ అప్లికేషన్ కు రూపకల్పన చేశాడీ ఈ బుడతడు.'టెక్ట్స్ జివ్' అనే ఈ యాప్ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నిపుణుల ప్రశంసలకు నోచుకుంది. మైక్రోసాఫ్ట్ నిర్వహించిన ఓ పోటీలో కొత్త యాప్ అందరి మన్ననలకు నోచుకుంది.

ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ జయకృష్ణకు సన్మానం చేయడం విశేషం. ఇంత చిన్న వయసులో అమోఘమైన సృజనాత్మకత ప్రదర్శించడం నిజంగా అద్భుతమని మైక్రోసాఫ్ట్ ఇండియా జీఎం జోసెఫ్ లాండెన్ కొనియాడారు. కాగా, తాను డిజైన్ చేసిన కొత్త అప్లికేషన్ వ్యాపారులకు బాగా ఉపయోగపడుతుందని జయకృష్ణ అంటున్నాడు.

  • Loading...

More Telugu News