: ప్రారంభమైన పీజీ మెడికల్ కౌన్సిలింగ్ ప్రక్రియ
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో పీజీ మెడికల్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వైద్య కళాశాలల్లో పీజీ ప్రవేశాలకు ఈ కౌన్సిలింగ్ ద్వారా సీట్లు కేటాయిస్తారు. ఇది తొలి విడత కౌన్సిలింగ్ కాగా, ఓపెన్ కేటగిరీలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. కాగా, మొదటి ర్యాంకర్ రామిరెడ్డి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎండీ జనరల్ మెడిసిన్ సీటు దక్కించుకున్నారు. ఉన్నత విద్యకు సంబంధించి కొన్నాళ్ళపాటు ఇరు రాష్ట్రాలకు ఒకే మండలి ద్వారా నోటిఫికేషన్లు, ప్రవేశాలు జరపాలని విభజన సందర్భంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.