: నిమ్స్ లో బాంబు కలకలం
హైదరాబాదులోని నిమ్స్ లో ఈ ఉదయం బాంబు కలకలం రేగింది. నిమ్స్ ఆసుపత్రిలో బాంబు ఉందంటూ పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ వచ్చింది. ఎవరో ఆగంతుకుడు ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో పోలీసులు వెంటనే స్పందించారు. హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్ నిమ్స్ పార్కింగ్ స్థలంలోనూ, ఆరోగ్యశ్రీ ఓపీ విభాగం వద్ద క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఇతర ప్రదేశాల్లోనూ బాంబు ఆచూకీ లభ్యమవుతుందేమోనని తనిఖీలు చేయగా, ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. దీంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.