: మండుతున్న ఎండలు... పాఠశాలలకు రెండు రోజులు సెలవ్


జూన్ నెల ద్వితీయార్థంలోనూ ఎండలు మండుతున్నాయి. సాధారణంగా జూన్ నెల రెండో వారంలోనూ వర్షాలు కురుస్తాయి, అలాంటిది ఈసారి వర్షాల జాడే లేకపోగా, వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. దాంతో గుంటూరు జిల్లాలో రెండు రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. బుధ, గురువారాలు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News