: విజయవాడ - గుంటూరు మధ్య అధునాతన ఆసుపత్రిని నిర్మిస్తాం: కామినేని
విజయవాడ - గుంటూరు మధ్యలో ఎయిమ్స్ తరహా ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. స్థల పరిశీలనకు త్వరలో కేంద్ర కమిటీ రాష్ట్రానికి వస్తుందన్నారు. 500 మెడికల్ సీట్లు కోల్పోతున్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.