: ఢిల్లీ యూనివర్శిటీ వీసీ రాజీనామా
ఢిల్లీ వర్శిటీ వైస్ ఛాన్సలర్ దినేశ్ సింగ్ రాజీనామా చేశారు. వర్శిటీ ప్రవేశపెట్టిన డిగ్రీ కోర్సు విషయంలో యూజీసీతో తలెత్తిన వివాదమే రాజీనామాకు కారణమని తెలుస్తోంది. ఈ వర్శిటీలో ఇవాళ్టి నుంచి డిగ్రీ కోర్సుకు అడ్మిషన్లు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, నాలుగేళ్ల డిగ్రీ కోర్సుకు విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, బలవంతంగా కొనసాగించడంతో ఆందోళనకు దారితీసింది. వీసీ ఈ కోర్సును గతేడాది ప్రారంభించారు. దేశవ్యాప్తంగా డిగ్రీ కోర్సు మూడేళ్లే ఉంది కాబట్టి దానికి భిన్నంగా నాలుగేళ్లు కోర్సు ప్రవేశపెట్టడం నిబంధనలకు విరుద్ధమని యూజీసీ స్పష్టం చేసింది. ఈ కోర్సును వెంటనే రద్దు చేయాలని యూజీసీ ఆదేశించింది. ఈ ఆదేశం వర్శిటీ స్వయంప్రతిపత్తిని నిరోధించడమేనని ఢిల్లీ వర్శిటీ పేర్కొంది. ఈ నేపథ్యంలో వైస్ ఛాన్సలర్ రాజీనామా సమర్పించారు.