: ఇకపై ప్రతి నెలా గ్యాస్, కిరోసిన్ మంట
ఇకపై ప్రతి నెలా గ్యాస్, కిరోసిన్ ధరలను పెంచేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. 80 వేల కోట్ల రూపాయల సబ్సిడీల భారం తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసింది. దీంతో ప్రతి నెలా గ్యాస్, కిరోసిన్ ధరలు పెరగనున్నాయి. ప్రతి నెలా గ్యాస్ పై ఐదు రూపాయలు, కిరోసిన్ పై అర్ధ రూపాయి పెంచనుందని సమాచారం. గ్యాస్ ధరలను సమీక్షించేందుకు ప్రధాని అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్రమిశ్రా అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైంది. త్వరలో దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.